వాలంటీర్లకు జగన్‌ మరో బంపర్ ఆఫర్‌?

Chakravarthi Kalyan
వాలంటీర్లకు జగన్‌ మరో బంపర్ ఆఫర్‌ ఇచ్చారు. వాలంటీర్లకు ఇప్పటివరకు ఇస్తున్న నగదు పురస్కారాల మొత్తాన్ని పెంచారు. సేవా వజ్ర పురస్కారం మొత్తాన్ని 30 వేల నుంచి 45 వేలకు పెంచారు. సేవా రత్న పురస్కారం మొత్తాన్ని 20 వేల నుంచి 30 వేలకు పెంచారు. సేవా మిత్ర పురస్కారం మొత్తాన్ని 10 వేల నుంచి 15 వేలకు పెంచారు. ఇలా రాష్ట్రవ్యాప్తంగా 2,55,464 మందికి మొత్తంగా రూ.392.05 కోట్ల నగదు పురస్కారాలు అందజేయనున్నారు.
ఉత్తమ గ్రామ, వార్డు సచివాలయ వాలంటీర్లకు సేవా మిత్ర, సేవా రత్న సేవా వజ్ర అవార్డుల ప్రదానం చేయనున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 7 రోజులపాటు పురస్కారాల ప్రదాన కార్యక్రమం నిర్వహించాలని ఇప్పటికే ఆదేశాలు జారీ అయ్యాయి. ఇవాళ గుంటూరు జిల్లా, ఫిరంగిపురంలో కార్యక్రమాన్ని సీఎం జగన్ లాంఛనంగా ప్రారంభిస్తారు. వాలంటీర్లపై ఇప్పటికే విపక్షాలు ఆరోపణలు గుప్పిస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: