అరబ్‌ దేశంలో హిందూ గుడి.. ఇవాళే మోడీ ప్రారంభం?

Chakravarthi Kalyan
యూఏఈలో ఇవాళ అబుధాబీలోని హిందూ ఆలయాన్ని ప్రధాని మోదీ చేతుల మీదుగా ప్రారంభించనున్నారు. పశ్చిమ ఆసియాలోనే అతిపెద్ద హిందూదేవాలయంగా అబుధాబీ మందిరం చరిత్ర సృష్టించింది. రూ.700 కోట్లతో అబుధాబీలో హిందూ ఆలయం నిర్మాణమైంది. 108 అడుగులు ఎత్తుతో 27 ఎకరాల్లో అబుధాబీలోని హిందూ ఆలయాన్ని నిర్మించారు. 262 అడుగుల పొడవు, 180 అడుగుల వెడల్పుతో అబుధాబీ ఆలయ నిర్మాణం జరిగింది.
 
భారతీయ శిల్పకళా సౌందర్యం ఉట్టిపడేలా అబుధాబీ ఆలయ నిర్మాణం జరిగింది. ఆలయంలోని ఫలకాలపై రామాయణం, శివపురాణం, భాగవతం, మహాభారతం కథలు రూపొందించారు. అబుధాబీ మందిరంలో 402 స్తంభాలు ఏర్పాటు చేసి  స్తంభాలపై దేవతామూర్తుల ప్రతిమలు ఏర్పాటు చేశారు. ఆలయ నిర్మాణంలో రాజస్థాన్‌ పింక్‌ స్టోన్స్‌, ఇటలీ పాలరాయి వినియోగించారు. అబుధాబీ మందిర రూపకల్పనలో 25 వేల టన్నుల రాళ్లు వాడారు. వెయ్యేళ్లకు పైగా చెక్కుచెదరకుండా ఉండేలా అబుధాబీ ఆలయాన్ని నిర్మించారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: