హరీష్ రావుపై కేటీఆర్‌ సంచలన పోస్ట్‌?

Chakravarthi Kalyan
తెలంగాణ అసెంబ్లీలో నిన్న సాగునీటి అంశంపై వాడివేడి చర్చ జరిగింది. ఈ చర్చలో బీఆర్ఎస్‌ తరపున హరీష్ రావు బాగా ప్రసంగించారు. కాంగ్రెస్ నేతలందరికీ హరీష్ రావు ఒక్కరే దీటుగా సమాధానం చెప్పారు. హరీష్ రావు తీరును మెచ్చుకున్న కేటీఆర్.. ఆ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా పంచుకున్నారు. తన బావ హరీష్ రావుపై కేటీఆర్ ప్రసంసల వర్షం కురిపించారు.

హరీష్ రావు అద్భుత ప్రసంగంతో శాసనసభలో ఒంటిచేత్తో సీఎం, మంత్రులు అందరినీ ఎదుర్కొన్నారన్న కేటీఆర్.. కృష్ణా జలాలు, కేఆర్ఎంబీకి సంబంధించి కాంగ్రెస్ నేతలు చేస్తున్న తప్పుడు ప్రచారం, అబద్దాలను హరీష్ రావు తిప్పికొట్టారన్నారు. ఇవాళ్టి ఛలో నల్గొండ సభకు హరీష్ రావు సరైన టోన్ సెట్ చేశారన్న కేటీఆర్.. కాంగ్రెస్ చేస్తున్న దుష్ప్రచారం, అబద్ధాలను రేపు నల్గొండ వేదికగా కేసీఆర్ తనదైన శైలిలో ఎండగడతారని తన పోస్టులో తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: