కేసీఆర్‌.. ఆ పని చేశాకే నల్గొండకు వెళ్లాలా?

Chakravarthi Kalyan
తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ మళ్లీ జనంలోకి రాబోతున్నారు. త్వరలో నల్గొండలో సభ నిర్వహించబోతున్నారు. బీఆర్ఎస్ ఓటమి తర్వాత ఏర్పాటు చేస్తున్న తొలి సభ ఇదే అవుతుంది. అయితే.. నల్గొండ ప్రజలకు కేసీఆర్‌ క్షమాపణ చెప్పి ముక్కు నేలకు రాసిన తర్వాతే ఇక్కడికి రావాలంటున్నారు నల్గొండకు చెందిన మంత్రి కోమిటిరెడ్డి వెంకట్‌రెడ్డి.. కేసీఆర్‌ మునిగిపోయే ప్రాజెక్టులు కట్టి లక్షల కోట్లు దోచుకున్నారని మంత్రి వెంకట్‌రెడ్డి ఆరోపించారు. కేసీఆర్‌ తన పదేళ్ల పాలనలో నల్గొండను పూర్తిగా నిర్లక్ష్యం చేసారని కోమటిరెడ్డి ఆరోపించారు.
బీఆర్ఎస్ కమీషన్ల కోసం అవసరం లేని ప్రాజెక్టులను కట్టిందన్న మంత్రి వెంకట్‌రెడ్డి.. ష్ణాజలాలపై కేసీఆర్ దొంగ దీక్షలు చేసి అధికారంలోకి వచ్చారన్నారు. కృష్ణా జలాలపై మాట్లాడే నైతిక హక్కు కేసీఆర్, హరీశ్‌రావుకు లేదని.. వారు జగన్‌ను ఇంటికి పిలిచి చీకటి ఒప్పందం చేసుకున్నారని.. జగన్‌తో లాలూచీ పడి రాష్ట్రానికి తీరని అన్యాయం చేశారని మంత్రి వెంకట్‌రెడ్డి మండిపడ్డారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: