పాఠ్య పుస్తకాల్లో బొత్స 120 కోట్లు మింగేశారా?

Chakravarthi Kalyan
ఏపీలో పాఠ్య  పుస్తకాల ముద్రణలోనూ స్కామ్‌ జరిగిందని టీడీపీ ఆరోపిస్తోంది. జగన్‌ కుంభకోణానికి పాల్పడుతున్నారని.. పాఠ్యపుస్తకాల్లోనే దాదాపు రూ.120 కోట్ల కుంభకోణం చేస్తున్నారని టీడీపీ నేత పట్టాభి ఆరోపించారు. కుంభకోణానికి విద్యాశాఖ మంత్రి బొత్స సహకరిస్తున్నారన్న టీడీపీ నేత పట్టాభి.. వచ్చే ఎన్నికల్లో వైకాపా తరఫున పోటీకి అభ్యర్థులు దొరకట్లేదని.. విద్యాశాఖ మంత్రి ఇంట్లోనే ఐదు సీట్లు ఇస్తామంటున్నారని.. అయితే.. ఐదు సీట్లు ఇస్తే ఎన్నికల బడ్జెట్‌ భరించలేమని బొత్స చెప్పారని.. అందుకే పాఠ్య పుస్తకాల టెండర్‌లో దోచుకోవాలని బొత్సకు సలహా ఇచ్చారని టీడీపీ నేత పట్టాభి విమర్శించారు.

దోచుకోవడానికి మార్గాలుండగా ఐదు కాకపోతే పది సీట్లు ఇవ్వవచ్చనుకున్న మంత్రి బొత్స.. వచ్చే ఎన్నికల్లో ఓట్ల కొనుగోలుకు డబ్బులు పోగేస్తున్నారని టీడీపీ నేత పట్టాభి అన్నారు. 2022లో 4 ప్యాకేజీలుగా పాఠ్యపుస్తకాల టెండర్లు పిలిచారని.. టన్ను పేపర్‌ ధర రూ.లక్ష ఉన్నప్పుడు పేజీ 23 పైసలకు టెండర్‌ పిలిచారని.. కానీ ప్రస్తుతం టన్ను పేపర్‌ ధర సుమారు రూ.85 వేలుగా ఉందని.. టన్ను పేపర్‌ ధర 15 శాతం తగ్గినా 34 పైసలకు టెండర్‌ పిలుస్తున్నారని టీడీపీ నేత పట్టాభి అన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: