మూసీ ప్రక్షాళన కోసం లండన్‌ ఎందుకు గుజరాత్‌ ఉందిగా?

Chakravarthi Kalyan
మూసీ రివర్ ప్రాజెక్టు పట్ల రేవంత్ రెడ్డి సర్కారు శ్రద్ధ చూపుతోంది. దాదాపు వెయ్యి కోట్లు కేటాయించింది. అంతే కాదు.. మూసీ ప్రక్షాళన కోసం అధ్యయనం కోసం రేవంత్ రెడ్డి లండన్‌ కూడా వెళ్లి వచ్చారు. ఆవిషయం బడ్జెట్ ప్రసంగంలోనూ చెప్పారు. అయితే.. మూసీ ప్రక్షాళన కోసం ఎంఐఎం నాయకుడు అక్బరుద్దీన్ తో లండన్ దాకా పోయిన ముఖ్యమంత్రి.. ఒకసారి గుజరాత్ సబర్మతీ నది దగ్గరకు వెళ్తే సుందరీకరణ ఎట్ల చేయాలో అర్థమవుతంటున్నారు తెలంగాణ బీజేపీ నేతలు.
15% ఉన్న మైనారిటీలకు రూ. 2,200 కోట్లు కేటాయించిన ప్రభుత్వం .. 50% పైగా ఉన్న బీసీ సంక్షేమానికి రూ.8 వేల కోట్లు మాత్రమే కేటాయించి బీసీలను మోసం చేసిందంటున్నారు. బడ్జెట్‌లో వైద్య రంగానికి రూ. 11 వేల కోట్లు కేటాయించిన ఈ ప్రభుత్వం.. అసలు ‘రాజీవ్ ఆరోగ్య శ్రీ’ని తెలంగాణలో అమలు చేస్తోందా? దీనికోసం ఎన్ని నిధులు అవసరం? ఎంత కేటాయించారు అని బీజేపీ నేతలు  ప్రశ్నించారు. ప్రభుత్వ ఆసుపత్రులను బలోపేతానికి నిధులు కేటాయించకుండా ఎన్నికల సందర్భంగా మీరు చేసిన వాగ్దానాలన్నీ ఎలా అమలు చేస్తారని నిలదీశారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: