బడ్జెట్‌లో ఎక్కువ భాగం ఆరు గ్యారెంటీలకేనా?

Chakravarthi Kalyan
తెలంగాణ బడ్జెట్‌లో ప్రధమ ప్రాధాన్యం ఆరు గ్యారంటీలకే దక్కింది. దాదాపు 50 వేల కోట్ల పైచిలుకు నిధులు ఆరు గ్యారంటీలకు కేటాయించారు. దూర దృష్టి, సమతుల్యతను ప్రదర్శించామని మంత్రులు చెప్పుకుంటున్నారు. గత 10 ఏళ్లుగా రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని గత భారాస హయాంలో నాశనం చేశారన్న మంత్రులు.. కాంగ్రెస్ ప్రభుత్వ తొలి బడ్జెట్ తెలంగాణ ఆర్థిక వ్యవస్థ పునరుజ్జీవనానికి పునాది వేసిందంటున్నారు.
బడ్జెట్‌లో కట్టుబడి ఉన్నందున, లోపభూయిష్ట అవినీతికి పాల్పడిన వారందరినీ విచారించి శిక్షిస్తామని..  మహాలక్ష్మి, రైతు భరోసా, గృహ జ్యోతి, ఇందిరమ్మ ఇళ్లు, యువ వికాసం, చేయూత - అభయ హస్తం అమలు కోసం 2.75 లక్షల కోట్ల మధ్యంతర బడ్జెట్‌లో 53,196 కోట్లతో 500 రూపాయలకే ఎల్‌పిజి సిలిండర్‌ను అందజేస్తామన్న హామీలలో ఒకదానిని పౌర సరఫరాల శాఖ తమ పరిధిలోని అమలు చేస్తామని చెబుతున్నారు. తెలంగాణ అభివృద్ధి ప్రక్రియలో గణనీయంగా దోహదపడుతున్న బడ్జెట్ అభివృద్ధికి, సంక్షేమానికి మధ్య సమతూకం కలిగిందంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: