కేసీఆర్‌ ఆ కాంగ్రెస్‌ లీడర్ని టార్గెట్‌ చేసి ఓడించారా?

Chakravarthi Kalyan
గత ఎన్నికల్లో కొందరు కాంగ్రెస్ లీడర్లను కేసీఆర్ టార్గెట్ చేసి మరీ ఓడించారా.. అంటే అవునంటున్నారు కాంగ్రెస్ లీడర్ జగ్గారెడ్డి. తనను ఓడించేందుకు కేసీఆర్ కాళేశ్వరం అవినీతి సొమ్ము వాడారని అంటున్నారు. హరీష్‌రావుతో కాళేశ్వరంలోదోచిన సొమ్ము లోంచి రూ.60 కోట్లను కేసీఆర్‌ సంగారెడ్డికి పంపించారని కాంగ్రెస్ నేత జగ్గారెడ్డి ఆరోపించారు. ఆ సొమ్ముతోనే తనపై గెలిచారని.. నా వద్ద 60 కోట్లు ఉంటే సంగారెడ్డిలో మీకు చుక్కలు చూయించేటోన్నని కాంగ్రెస్ నేత జగ్గారెడ్డి అంటున్నారు.
హరీష్ రావు నల్ల డబ్బు ఎక్కడ దాచారో బయటకు తీయమని మా సీఎం రేవంత్ రెడ్డితో చెప్పానన్న కాంగ్రెస్ నేత జగ్గారెడ్డి.. 135 యేండ్ల ఘనమైన చరిత్ర కలిగిన కాంగ్రెస్ ఉంది ...ఆ చరిత్రను కూల్చడం ఎవరితరం కాదన్నారు. జగ్గారెడ్డి కాంగ్రెస్ పార్టీలో ఒక వెపన్, ఒక బ్రాండ్ అన్నారు. అనేక ఒడిదుడుకులతో పైకి వచ్చినోన్ని.. పదవుల కోసం బానిసత్వం చేసేటోన్నికాదని బీఆర్ఎస్ నేతలు తెలుసుకోవాలని కాంగ్రెస్ నేత జగ్గారెడ్డి అన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: