అవన్నీ సీజ్‌ చేసి పారేయండి.. రేవంత్‌రెడ్డి ఆర్డర్స్‌?

Chakravarthi Kalyan
హైదరాబాద్ పరిసరాల్లో అనుమతి లేని స్టోన్ క్రషర్స్ సీజ్ చేయాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. సెల్లార్లు 6 మీటర్ల కంటే ఎక్కువ పన్ను వసూలు చేయాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు ఇచ్చారు. భారీ భవనాల వివరాలు గనుల శాఖకు చేరేలా సమీకృత ఆన్ లైన్ విధానం అమలు చేయాలి సీఎం రేవంత్ రెడ్డి అధికారులకు సూచించారు. గ్రానైట్, ఖనిజాల తవ్వకాలు, అక్రమ రవాణా అరికట్టేందుకు జియో ట్యాగింగ్, జీపీఆర్ఎస్ వినియోగించాలని రేవంత్ రెడ్డి సూచించారు.

గ్రానైట్, ఇతర క్వారీలకు సంబంధించిన కేసులు, దర్యాప్తు స్థితిపై నివేదిక ఇవ్వాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. టోల్ గేట్ల వద్ద డేటా ఆధారంగా ఇసుక అక్రమ రవాణా వివరాలు బయటకు తీయాలని... ఇసుక రీచ్లు, డంపులు తనిఖీ చేసి... అక్రమాలపై కఠిన చర్యలుతీసుకోవాలని.. గనులు, భూగర్భ వనరుల విభాగాన్ని సమూలంగా ప్రక్షాళన చేయాలని  సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: