లంచాలతో మెక్కిన సొమ్ము.. ఏకంగా రూ. వెయ్యి కోట్లు?

Chakravarthi Kalyan
హెచ్‌ఎండీఏ మాజీ డైరెక్టర్‌ శివబాలకృష్ణ అక్రమాస్తుల చిట్టా విస్తుగొలుపుతోంది. ఆయన ఏసీబీ కస్టడీ ముగిసింది. కస్టడీలో 8 రోజులపాటు శివబాలకృష్ణను ఏసీబీ ప్రశ్నించింది. ఈ విచారణలో శివబాలకృష్ణ బినామీల పేరిట తెలుగు రాష్ట్రాల్లో 214 ఎకరాల భూమి ఉన్నట్టు గుర్తించారు. తెలంగాణలోనే కాకుండా ఏపీలోనూ శివబాలకృష్ణ భూములు కొన్నారు. జనగామలో 102 ఎకరాల భూమి ఉన్నట్టు ఏసీబీ గుర్తించింది. శివ బాలకృష్ణ పేరిట 7ఇళ్లు, ఒక విల్లా ఉన్నట్టు ఏసీబీ గుర్తించింది.

శివ బాలకృష్ణకు రూ.250 కోట్ల ఆస్తులు ఉన్నట్లు గుర్తించిన ఏసీబీ అధికారులు.. వీటి మార్కెట్‌ విలువ వెయ్యి కోట్ల పైమాటే అని చెబుతున్నారు. తన ఆస్తులకు శివ బాలకృష్ణ ప్రధానంగా ముగ్గురు బినామీలను పెట్టుకున్నారు. శివ బాలకృష్ణ కుటుంబం పేరిట 29 ప్లాట్లు గుర్తించామని తెలిపిన ఏసీబీ అధికారులు.. శివబాలకృష్ణ సోదరుడు శివనవీన్‌ను కూడా కస్టడీకి తీసుకుంటామన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: