భక్తులకు గుడ్‌న్యూస్‌: ఆన్‌లైన్‌లో మేడారం మొక్కులు?

Chakravarthi Kalyan
మేడారం జాతరకు వెళ్లలేని భక్తులూ కూడా మొక్కులు సమర్పించే అవకాశం లభించింది. సమ్మక్క సారలమ్మకు నిలువెత్తు బంగారం (బెల్లం) సమర్పించే సదుపాయం తెలంగాణ సర్కారు కల్పిస్తోంది. మొక్కుల చెల్లింపునకు ఆన్‌లైన్‌ సదుపాయం కల్పించిన తెలంగాణ దేవదాయ శాఖ.. మీసేవ, పోస్టాఫీసులు, టీ యాప్ ఫోలియో ద్వారా బుక్ చేసుకునే అవకాశం కల్పిస్తోంది. బరువు ప్రకారం డబ్బులు చెల్లించి మొక్కు సమర్పణ సేవ బుక్ చేసుకునే అవకాశం కల్పిస్తోంది తెలంగాణ దేవదాయ శాఖ.
కిలోకు రూ.60 చెల్లించి బరువుకు తగిన బంగారం (బెల్లం) సమర్పించే అవకాశం కల్పిస్తోంది తెలంగాణ దేవదాయ శాఖ. ఆన్‌లైన్‌లో మేడారం సమ్మక్క, సారక్క ప్రసాదం పొందే అవకాశం కూడా ఉంది. డబ్బులు చెల్లిస్తే తపాలాశాఖ కొరియర్ ద్వారా ప్రసాదం కూడా పంపించనుంది. తాజాగా మేడారం ఆన్‌ లైన్‌ సేవలను మంత్రి కొండా సురేఖ ప్రారంభించింది. ఈ అవకాశం బావుంది కదా.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: