బాలకృష్ణ అవినీతి కేసులో మరో ట్విస్ట్?

Chakravarthi Kalyan
ఆదాయానికి మించి ఆస్తుల కేసులో అరెస్ట్ అయిన రేలా మాజీ కార్యదర్శి శివ బాలకృష్ణ వ్యవహారంలో మరో ట్విస్ట్ చోటు చేసుకుంది. తాజాగా అతని సోదరుడు శివ నవీన్ కుమార్ ను ఏసీబీ పోలీసులు అరెస్టు చేశారు. శివ బాలకృష్ణ అక్రమ ఆస్తులకు సోదరుడు నవీన్ కుమార్  బినామీగా ఉన్నట్టు గుర్తించారు. ఇప్పటికే శివ బాలకృష్ణ ను ఎనిమిది రోజుల కస్టడీలో భాగంగా ప్రశ్నిస్తున్న ఏసీబీ అధికారులు.. విచారణలో వెల్లడైన వాస్తవాల ఆధారంగా అరెస్టులు చేస్తున్నారు.

ఇప్పటికే బాలకృష్ణ అక్రమాస్తులు వెయ్యి కోట్లకు చేరాయని సాక్షాత్తూ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కామెంట్ చేయడం విశేషం. అంతే కాదు.. హెచ్ ఎండీ ఏలో అనేక అక్రమాలకు శివ బాలకృష్ణకు లింక్ ఉందని అనుమానిస్తున్నారు.  శివ బాలకృష్ణ వెనుక పెద్ద తలకాయలు ఉండొచ్చని ఏసీబీ భావిస్తోంది. మరి ఈ కేసు విచారణలో ఏం తేలుతుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

acb

సంబంధిత వార్తలు: