షాకింగ్‌: రేవంత్‌ సర్కారు కూలబోతోందన్న విజయసాయి?

Chakravarthi Kalyan
ఆరు నెలల్లో తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం కూలుతుందని వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి షాకింగ్‌ వ్యాఖ్యలు చేశారు. ఏకంగా రాజ్యసభలోనే ఈ మాటలు చెప్పారు. ఏపీకి కాంగ్రెస్‌ తీవ్ర అన్యాయం చేసిందని.. రాష్ట్రాన్ని అన్యాయంగా విభజించారని హస్తం పార్టీపై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి విరుచుకుపడ్డారు. తెలంగాణ ఏర్పాటు చేసినా కాంగ్రెస్‌కు 10ఏళ్లు అధికారం దక్కలేదన్న వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి.. పదేళ్ల తర్వాత అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్‌ సర్కార్‌ త్వరలో కూలడం ఖాయమన్నారు.

కుటుంబాలను చీల్చడం కాంగ్రెస్‌కు అలవాటన్న వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి.. దేశంలో అతి త్వరలో ఆ పార్టీ కనుమరుగవుతుందన్నారు. పార్లమెంట్ లో ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి. ఇప్పటికే వైఎస్ షర్మిల ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలిగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి వైసీపీ, కాంగ్రెస్ మధ్య మాటల యుద్ధం తీవ్రమైంది. ఇక ఇప్పుడు  విజయసాయి రెడ్డి రాజ్యసభలో తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం గురించి చేసిన ఈ వ్యాఖ్యలు ఎంత దుమారం లేపుతాయో?

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: