కేసీఆర్‌ హయాంలో విద్యాకుంభకోణం కూడా?

Chakravarthi Kalyan
కేసీఆర్ ప్రభుత్వం హయంలో విద్యా రంగంలో అనేక అవినీతి, అక్రమాలు జరిగాయని హైకోర్టు న్యాయవాది రాపోల్‌ భాస్కర్‌ అంటున్నారు. వాటిపై సమగ్ర విచారణ జరిపించాలి హైకోర్టు న్యాయవాది రాపోల్‌ భాస్కర్‌ డిమాండ్‌ చేశారు. ఆయన దీనిపై ముఖ్యమంత్రికి, డైరెక్టర్‌ ఆఫ్‌ స్కూల్‌ ఎడ్యుకేషన్‌ దేవసేన, ప్రిన్సిపల్‌ సెక్రెటరీ ఆఫ్‌ తెలంగాణ బుర్రా వెంకటేశం లేఖ రాశారు. కేసీఆర్‌ ప్రభుత్వంలో వృత్తి విద్యా నైపుణ్య కోర్సులో జరిగిన అక్రమాలను హైకోర్టు న్యాయవాది రాపోల్‌ భాస్కర్‌ వివరించారు.

గ్రామీణ ప్రాంతంలో 9, 10 తరగతి చదువుకున్న పేద విద్యార్థులకు వృత్తి నైపుణ్యం పెంపొందించేందుకు వృత్తి విద్యా కోర్సులను ప్రవేశపెట్టారని.. దానిని అమలు కోసం థర్డ్‌ పార్టీకి చెందిన ఎంటీఎస్‌ సంస్థలకు ఇచ్చారని హైకోర్టు న్యాయవాది రాపోల్‌ భాస్కర్‌ అన్నారు. అందులో గుడిపూరిడి ప్రియాంక, అకుతోట సురేందర్‌ వీరితో పాటు సమగ్ర శిక్షా అధికారులైన రమేశ్‌, వెంటక నర్సమ్మ కుమ్మక్కయ్యారని..  సుమారు 2 కోట్ల రూపాయలను దారి మళ్లించారని హైకోర్టు న్యాయవాది రాపోల్‌ భాస్కర్‌ ఆరోపించారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

kcr

సంబంధిత వార్తలు: