మావోయిస్టుల రహస్యాల విలువైన పుస్తకం ఇదే?

Chakravarthi Kalyan
మంగళారపు లక్ష్మణ్ రచించిన మాయని గాయాల నెత్తుటి చరిత్ర పుస్తం మావోయిస్టు ఉద్యమం గురించి వివరిస్తోంది. ఈ పుస్తక ఆవిష్కరణ సభ హైదరాబాద్ రవీంద్రభారతిలో జరిగింది. ప్రత్యేక తెలంగాణ ఉద్యమం ప్రారంభమైన తర్వాత 2001 నుండి పీపుల్స్ వార్ ప్రస్తుత మావోయిస్ట్ పార్టీలోకి రిక్రూట్మెంట్ దాదాపుగా నిలిచిపోయింది. నక్సలైట్ ఉద్యమం ప్రారంభకాలం నాటి పరిస్థితులు ఈనాడు లేవు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత ప్రజల ఆర్థిక పరిస్థితి మెరుగైంది. కానీ యాభై ఏళ్ళ నక్సలైట్ ఉద్యమ చరిత్రను సంపూర్ణంగా లిఖించిన చరిత్ర కారులెవరూ లేరు. కరీంనగర్ జిల్లా హుస్నాబాద్ ప్రాంత ఉద్యమ సంఘటనలను, త్యాగాలను మంగళారపు లక్ష్మణ్ రచించారు. తెలంగాణ నలుమూలల నుండి తమ ప్రాంత విప్లవోద్యమాల చరిత్రను రాయడానికి విశ్రాంత ఉపాధ్యాయులు, జర్నలిస్టులు, రచయితలు, ఆసక్తిగల పరిశోధకులు ముందుకు రావాలి. వీళ్ళంతా రాసే రచనలను సంకలనం చేయడం, అధ్యయనం చేయడం ద్వారా సంపూర్ణ ఉద్యమ చరిత్రను లిఖించడం సాధ్యపడుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: