తెలంగాణలో చొరబడిన మయన్మార్‌ దేశస్తులు?

Chakravarthi Kalyan
తెలంగాణ, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, హర్యానా, జమ్మూ కాశ్మీర్ లలో ఉన్న రోహింగ్యాలతో వివాహం పేరుతో బంగ్లాదేశ్ యువతులకు వల వేస్తున్నారు. నకిలీ పత్రాలతో ఇక్కడ ఆధార్ కార్డులు సైతం నిందితులు పొందుతున్నారు. ఈ విషయాలను ఎన్‌ఐఏ కోర్టుకు తెలిపింది. అంతర్జాతీయ మానవ అక్రమ రవాణా కేసులో ముగ్గురు మయన్మార్ దేశస్తుల పై ఎన్ఐఏ చార్జిషీట్ దాఖలు చేసింది. భారత్ దేశం, బంగ్లాదేశ్ సరిహద్దుల నుంచి మయన్మార్ దేశస్తులు అక్రమంగా చొరబడ్డారని చార్జిషీట్ లో తెలిపింది.

పలువురు ట్రాఫికర్లు, రోహింగ్యలతో కలిసి అక్రమంగా భారత్ లోకి చొరబడ్డారని విచారణలో తేలింది. బంగ్లాదేశ్  రెఫ్యుజి క్యాంపులో ఉన్న మహిళల రోహింగ్యలను భారత్ లోకి పంపుతున్నారు. నకిలీ పత్రాలతో ఇక్కడ ఆధార్ కార్డులు సైతం నిందితులు పొందినట్లు తేలింది. ఆధార్ కార్డులతో తన పేరుతో సిమ్ కార్డులు విక్రయాలు జరిపినట్లు తేలింది. భారత్ దేశానికి చెందిన బ్యాంకు ఖాతాలను నిందితులు వినియోగిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: