పల్లెకు పోదాం ఛలో ఛలో అంటున్న మోదీ, నడ్డా?

Chakravarthi Kalyan
బీజేపీ మరో కొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. గావ్ చలో.. ఘర్ చలో పేరిట పల్లెల్లో కార్యక్రమాలు చేపట్టింది. రేపటి నుంచి ఈ కార్యక్రమం దేశవ్యాప్తంగా ఈనెల 5 నుంచి 15వ తేదీ వరకు కొనసాగనుంది. 24 గంటల పాటు ఒక పోలింగ్ బూత్ కు చెందిన నేతలు మరో పోలింగ్ బూత్ ను పర్యవేక్షిస్తారు. ఒక డివిజన్ కు చెందిన వారు మరో డివిజన్ లో పాల్గొంటారు. స్థానిక ప్రజలతో పాటు కార్యకర్తలను కలిసి స్థానిక పరిస్థితులపై ఆరా తీస్తారు. పదేండ్లలో మోదీ పాలనలో జరిగిన అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలుపై వివరిస్తారు.
ఫిబ్రవరి 6వ తేదీన రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి అమీర్ పేట మండలంలో నిర్వహించే గావ్ చలో అభియాన్ లో పాల్గొంటారు.  డీకే అరుణ ధన్వాడ, నారాయణపేటలో పాల్గొంటారు. లక్ష్మణ్.. ముషీరాబాద్ లో, బండి సంజయ్..హుజురాబాద్ మండలం రంగాపూర్ గ్రామంలో.. మురళీధర్ రావు కూకట్ పల్లిలో, పొంగులేటి సుధాకర్ రెడ్డి ఖమ్మంలో పాల్గొంటారు. ఈటల రాజేందర్ కమలాపూర్, హుజురాబాద్ లో పాల్గొంటారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

bjp

సంబంధిత వార్తలు: