నేటి నుంచి బీజేపీ.. దేశవ్యాప్తంగా షాకింగ్‌ ప్రోగ్రామ్‌?

Chakravarthi Kalyan
ఇవాళ్టి నుంచి బీజేపీ గావ్ చలో.. ఘర్ చలో కార్యక్రమం అమలు చేస్తోంది. ఈ కార్యక్రమం దేశవ్యాప్తంగా ఈనెల 5 నుంచి 15వ తేదీ వరకు కొనసాగనుంది. తెలంగాణ రాష్ట్రంలో నిర్వహించే కార్యక్రమాల్లో ముఖ్య నేతలు అందరూ పాల్గొంటారు. 2014 ఎన్నికల్లో బీజేపీ దేశవ్యాప్తంగా 17 కోట్ల ఓట్లు సాధించింది. 2019 పార్లమెంట్ ఎన్నికల్లో 22 కోట్ల ఓట్లను సాధించింది. ప్రస్తుతం మొత్తం ఓట్లలో 51 శాతం ఓట్లను సాధించాలనే ప్రధాన లక్ష్యం లక్ష్యంతో బీజేపీ పనిచేస్తోంది. అందుకే గావ్ చలో.. ఘర్ చలో కార్యక్రమం చేపట్టారు.
మొదటి విడుతలో నేతలు 24 గంటలు ఆయా గ్రామాల్లో ఉంటారు. మరోసారి ఈనెలలోనే 12 గంటల పాటు గావ్ చలో.. ఘర్ చలో కార్యక్రమంలో పాల్గొంటారు. తెలంగాణలోని 12,769 గ్రామపంచాయతీలు, ఇతర గ్రామాల హామ్లెట్ గ్రామాలకు వెరసి రాష్ట్రంలోని 35 వేల పోలింగ్ బూత్ లకు రాష్ట్ర అధ్యక్షుడి నుంచి మొదలుకుని జాతీయ స్థాయి నేత వరకు గావ్ చలో.. ఘర్ చలో కార్యక్రమానికి హాజరవుతారరు.

మరింత సమాచారం తెలుసుకోండి:

bjp

సంబంధిత వార్తలు: