రేవంత్‌ పిల్లకాకి.. కేసీఆర్‌ను ఏం చేస్తారు?

Chakravarthi Kalyan
వైఎస్ఆర్, చంద్రబాబు ఒక్కటైనా కేసీఆర్ ను ఏం చేయలేకపోయారని.. అలాంటింది పిల్ల కాకి లాంటి రేవంత్‌ రెడ్డి కేసీఆర్‌ను ఏం చేస్తారని మాజీ మంత్రి జగదీష్ రెడ్డి ప్రశ్నించారు. ఈ పిల్ల కాకులు బీఆర్‌ఎస్‌ను ఏం చేస్తాయని ఆయన ప్రశ్నించారు. కేటీఆర్ ను తెలంగాణకు మంత్రి అని ఎవరూ అనుకోలేదని, దేశానికి మంత్రి అనుకున్నారని మాజీ మంత్రి జగదీష్ రెడ్డి పేర్కొన్నారు. విద్యుత్ కార్మికులకు కేసీఆర్ అండగా నిలబడతారని, కాంగ్రెస్ వెనకున్న తోక సంఘాలు ఏమీ చేయలేవని మాజీ మంత్రి వ్యాఖ్యానించారు. తెలంగాణ ఉద్యమ స్ఫూర్తితో పోరాటం చేయాలని విద్యుత్ కార్మికులకు సూచించారు.

రాష్ట్రంలో 24 గంటల ఉచిత విద్యుత్ అందించిన చరిత్ర కేసీఆర్ కే దక్కుతుందన్న మాజీ మంత్రి జగదీష్ రెడ్డి.. విద్యుత్ సంస్కరణలతోనే దేశంలో తెలంగాణకు ప్రత్యేక గుర్తింపు లభించిందన్నారు. తెలంగాణ రాష్ట్ర విద్యుత్ కార్మిక సంఘం డైరీ, క్యాలెండర్ ను హైదరాబాద్ లోని తెలంగాణ భవన్ లో ఆయన ఆవిష్కరించారు. విద్యుత్ కార్మికుల పక్షాన కొట్లాడేది బీఆర్‌ఎస్‌ మాత్రమే అన్న మాజీ మంత్రి జగదీష్ రెడ్డి... పొరుగుసేవల ఉద్యోగులను క్రమబద్దీకరించింది కూడా తామేనన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: