రేవంత్‌ గుడ్‌న్యూస్‌.. అందరికీ డిజిటల్ హెల్త్ కార్డులు?

Chakravarthi Kalyan
తెలంగాణలో ప్రజలందరికీ డిజిటల్ హెల్త్ ప్రొఫైల్ సిద్ధం చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్ణయించారు. డిజిటల్ హెల్త్ ప్రొఫైల్ కార్డుకు ఒక నంబరు కేటాయించి.. దాన్ని ఆరోగ్యశ్రీని అనుసంధానం చేయాలని రేవంత్ రెడ్డి ఆదేశించారు. ఆరోగ్యశ్రీకి తెల్ల రేషన్ కార్డు తప్పనిసరి అనే నిబంధన సడలించే అంశాన్ని పరిశీలించాలని అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. సచివాలయంలో వైద్యారోగ్య శాఖపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. ఆరోగ్యశ్రీ కార్డు కోసం తెల్ల రేషన్ కార్డు తీసుకునే వారి సంఖ్య పెరుగుతోందన్న సీఎం రేవంత్ రెడ్డి.. ప్రభుత్వ ఆసుపత్రులకు ప్రతీ నెలా ఆరోగ్యశ్రీ నిధులు విడుదల చేయాలని ఆదేశించారు.

ప్రైవేట్ ఆస్పత్రులకు మూడు నెలలకోసారి ఆరోగ్యశ్రీ బిల్లులు విడుదల చేసేలా ఒప్పందం కుదుర్చుకోవాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులకు సూచించారు. ప్రభుత్వ, బోధనాస్పత్రులకు పెండింగులో ఉన్న 270 కోట్ల రూపాయల  ఆరోగ్య శ్రీ బిల్లులను వెంటనే విడుదల చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: