అక్కడ ఛీకొట్టారు.. షర్మిలపై రోజా ఫైరింగ్‌?

Chakravarthi Kalyan
పీసీసీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిలపై ఏపీ పర్యాటక మంత్రి ఆర్కే రోజా మండిపడ్డారు. తెలంగాణ ప్రజలు ఛీ కొడితే ఆంధ్రప్రదేశ్ లోకి షర్మిల వచ్చారని.. షర్మిలను రాష్ట్ర ప్రజలు అంగీకరించబోరని ఏపీ పర్యాటక మంత్రి ఆర్కే రోజా అన్నారు. వైఎస్ షర్మిల రాష్ట్ర రాజకీయాల్లోకి సంక్రాంతికి వచ్చే డుడూ బసవన్నల మాదిరి వచ్చారని ఏపీ పర్యాటక మంత్రి ఆర్కే రోజా ఎద్దేవా చేశారు. వైఎస్ఆర్ అభిమానులంతా జగన్ వెంటే ఉన్నారు ఉంటారని..షర్మిల లాంటివారిని రాష్ట్ర ప్రజలు ఆదరించరని రోజా మండిపడ్డారు.

సామాజిక న్యాయానికి సీఎం జగన్మోహన్ రెడ్డి పెద్ద పీట వేస్తున్నారన్న ఏపీ పర్యాటక మంత్రి ఆర్కే రోజా.. జగన్ పాలనపై రాష్ట్ర ప్రజలంతా సంతృప్తిగా ఉన్నారన్నారు. గతంలో ఎప్పుడూ లేని అభివృద్ధి రాష్ట్రంలో కనిపిస్తోందని.. విజయవాడ నగరంలో అంబేద్కర్ భారీ విగ్రహం, బాపూ మ్యూజియం, భవాని ఐలాండ్ వంటి పర్యాటక ప్రాంతాలను అభివృద్ధి చేశామని ఏపీ పర్యాటక మంత్రి ఆర్కే రోజా అన్నారు. 2024 ఎన్నికల్లో జగన్ గెలుపు ఎవరూ ఆపలేరని రోజా అన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: