బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలతో రేవంత్‌.. మంచిపనేనా?

Chakravarthi Kalyan
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఇటీవల బీఆర్ఎస్‌ ఎమ్మెల్యేలు కలవడం కలకలం సృష్టించింది. అయితే.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రతిపక్ష ఎమ్మెల్యేలు కలిసేందుకు సమయమిచ్చి మంచి సంప్రదాయానికి తెర లేపారని కాంగ్రెస్‌ మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి అంటున్నారు. బీఆర్‌ఎస్‌  ఎమ్మెల్యేలు సీఎంను ఎందుకు కలిశారో తనకు తెలియదన్న జగ్గారెడ్డి తొమ్మిదిన్నర ఏళ్లలో కేసీఆర్ పరిపాలనలో ఏ రోజైనా ప్రతిపక్ష ఎమ్మెల్యేలను కలవనిచ్చారా అని ప్రశ్నించారు.
గతంలో వైఎస్ఆర్ సీఎంగా ఉన్నప్పుడు బీజేపీకు చెందిన కిషన్ రెడ్డి,బండారు దత్తాత్రేయ కలిశారని దీనికి రఘునందన్ రావు ఏ సమాధానం చెబుతారని జగ్గారెడ్డి ప్రశ్నించారు. కిషన్ రెడ్డి కేసీఆర్‌ను కూడా కలిశారని జగ్గారెడ్డి గుర్తు చేశారు. గతం గురించి కేటీఆర్ మాట్లాడితే తాము చాలా మాట్లాడాల్సి వస్తుందన్న జగ్గారెడ్డి..  సీఎం రేవంత్ రెడ్డి గురించి మాట్లాడే అర్హత కేటీఆర్‌కు లేదన్నారు. మరి ఆ విషయం కూడా వాస్తవమే కదా అనిపించకమానదు.

మరింత సమాచారం తెలుసుకోండి:

brs

సంబంధిత వార్తలు: