ఆ అధికారి అవినీతి సంపాదన రూ.100 కోట్లు?

Chakravarthi Kalyan
హైదరాబాద్‌లో అవినీతి నిరోధక శాఖ వలలో మరో భారీ తిమింగళం చిక్కింది. హెచ్‌ఎండీఏ పట్టణ ప్రణాళిక డైరెక్టర్‌ శివ బాలకృష్ణ ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్నట్టు ఏసీబీ తెలిపింది. ఇప్పుడు మెట్రో రైల్‌లో ప్లానింగ్‌ అధికారితో పాటు రెరాలో కార్యదర్శిగా కూడా శివ బాలకృష్ణ పని చేస్తున్నారు. ఇవాళ ఏకకాలంలో 14 బృందాలు బాలకృష్ణ నివాసం, ఆయన కార్యాలయాలు, బంధువుల ఇళ్లలో సోదాలు చేశాయి. ఇప్పటి వరకూ 100 కోట్లకు పైగా బంగారం, ఆస్తులు, 40 లక్షల నగదు, ఇళ్లు, ఫ్లాట్‌లు, ఖాళీ స్థలాలు తనిఖీల్లో బయటపడ్డాయి.

40 లక్షల నగదు, రెండు కిలోల బంగారం, స్ధిర చరాస్థుల డాక్యుమెంట్లు దొరికాయి. అంతే కాదు 60ఖరీదైన చేతి వాచ్‌లు, 14 మొబైల్‌ ఫోన్లు, 10ల్యాప్‌ టాప్‌ లు దొరికాయి. ఆయనకు చెందిన  నాలుగు బ్యాంకు లాకర్లు కూడా గుర్తించారు.  ఈ సోదాలు రేపు కూడా కొనసాతాయట. హెచ్‌ఎండిఏ లో ఉన్నప్పటి నుంచే లంచాలకు అలవాటు పడిన శివబాలకృష్ణ.. వెనుక రాజకీయ నాయకులు కూడా ఉన్నట్టు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

acb

సంబంధిత వార్తలు: