ఏపీ ఫైనల్‌ ఓటర్‌ లిస్టులు రెడీ.. ఆ పార్టీకి షాక్‌?

Chakravarthi Kalyan
ఏపీలో ఎన్నికల వేడి పెరుగుతోంది. ఎన్నికల ప్రధానాధికారి రాజకీయ పార్టీలకు తుది ఓటర్ ల జాబితాను ఇచ్చేశారు. అయితే.. ఈ జాబితాలపై టీడీపీ అనుమానం వ్యక్తం చేస్తోంది. 4 కోట్ల పై చిలుకు ఓటర్ లు ఉన్నట్టు గా అందులో పేర్కొన్నారని.. ఈ జాబితా లో యువ ఓటర్ ల సంఖ్య తక్కువగా ఉందని.. ఇది చాలా ప్రమాదకరమని టీడీపీ నేత వర్ల రామయ్య అంటున్నారు. జిల్లాల తో పాటు నియోజకవర్గాల స్థాయి లోనూ జాబితాల ను ఇవ్వాలనీ కోరామని.. తప్పు చేసిన కలెక్టర్ లు, అధికారుల పై చర్యలు తీసుకోవాలని కోరామని.. టీడీపీ నేత వర్ల రామయ్య అన్నారు.
 
ఒక్క అన్నమయ్య కలెక్టర్ గిరీశా ను సస్పెండ్ చేస్తే సరిపోతుందా అని ప్రశ్నించిన  టీడీపీ నేత వర్ల రామయ్య.. ప్రభుత్వం దొడ్డిదారిన ఎన్నికలకు వెళ్లేందుకు ప్రయత్నం చేస్తోందన్నారు. విడదల రజినీ, వెలంపల్లి, మేరుగ నాగార్జున తదితరులు బల్క్ ఫార్మ్ 6 అప్లికేషన్ లు దాఖలు చేశారని టీడీపీ నేత వర్ల రామయ్య ఆరోపించారు. ఇంకా జగన్ కు 81 రోజుకు మాత్రమే పాలన ఉందని.. ఎన్నికల అధికారులు తప్పుడు విధానాలు పాటిస్తే ఫలితం అనుభవిస్తారని ఆయన అన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: