బాబు, పవన్ చర్చలు.. ఆ ప్యాకేజీ కోసమేనా?
జనసేన అధినేత పవన్‌కళ్యాణ్‌ను మేము ప్యాకేజీ స్టార్ అన్నప్పడల్లా ఆయన ఉలికులికిపడుతూ ఎగిరెగిరిపడుతుంటాడన్న కనుమూరి రవిచంద్రారెడ్డి.. ఇటీవల చంద్రబాబు ఇచ్చే ప్యాకేజీ దత్తపుత్రునికి సరిపోవడంలేదనే విషయంపై కొంత చర్చ జరుగుతోందన్నారు. అందుకే చంద్రబాబు కొడుకు లోకేశ్ తలపెట్టిన యువగళం ముగింపు సభకు మొదట పవన్‌కళ్యాణ్ హాజరుకావడంలేదన్నాడని.. అందుకే నేరుగా చంద్రబాబు రాయబారానికి సిద్ధపడ్డాడని తెలిపారు. అందుకే చంద్రబాబు హైదరాబాద్‌లో పవన్ ఇంటికి ఆయన వెళ్లి మాట్లాడి బుజ్జగించారన్నారు.