రూ.300 కోట్ల నోట్ల గుట్టలు.. కాంగ్రెస్ అందుకే దాచిందా?

Chakravarthi Kalyan
ఇటీవల జార్ఖండ్‌ రాష్ట్రానికి చెందిన కాంగ్రెస్ ఎంపీ ధీరజ్ సాహు ఇంటి, వ్యాపార సముదాయాలపై జరిపిన ఐటీ సోదాల్లో 290కోట్ల అక్రమ సంపాదనను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. దేశ చరిత్రలో ఆదాయ పన్ను అధికారుల దాడుల్లో ఒకే చోట ఇంతపెద్ద అక్రమ సంపాదన బయటపడటం ఇదే తొలిసారి. దీని ద్వారా కాంగ్రెస్ పార్టీ అవినీతి ఏ రకంగా ఉందో అర్థం చేసుకోవచ్చుననికేంద్ర మంత్రి బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు కిషన్ రెడ్డి తెలిపారు.
రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్రకు ధీరజ్ సాహు అన్ని ఏర్పాట్లు చేశారని కిషన్ రెడ్డి ఆరోపించారు. పార్లమెంట్ ఎన్నికల కోసం కూడగట్టిన నోట్ల గుట్టలా అని కిషన్ రెడ్డి ప్రశ్నించారు. యూపిఏ హయాంలో 12లక్షల కోట్ల అవినీతి జరిగిందన్న కిషన్ రెడ్డి... తొమ్మిదిన్నరేళ్లుగా నరేంద్రమోదీ ప్రభుత్వం నీతివంతమైన పాలన అందిస్తోందన్నారు. ఐటీ సోదాలు చేయాలో వద్దో కాంగ్రెస్ పార్టీ దేశ  ప్రజలకు చెప్పాలని డిమాండ్ చేశారు. కర్ణాటక రాష్ట్రానికి చెందిన డబ్బు తీసుకువచ్చి కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో పంచిందని కిషన్ రెడ్డి విమర్శించారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: