దుమ్ముదులుపుతున్న ఏపీ ఏసీబీ టీమ్‌?

Chakravarthi Kalyan
ఏపీ ఏసీబీ టీమ్‌ దుమ్ముదులుపుతోంది. 2023 జనవరి నుంచి ఇప్పటి వరకూ 146 కేసులు అవినీతి అధికారులపై నమోదు చేసింది. కేవలం నెల రోజుల వ్యవధిలోనే 22 కేసులు నమోదు చేసినట్టు ఏసీబీ డీజీ రాజేంధ్రనాథ్ రెడ్డి తెలిపారు. 14400 కాల్ సెంటర్ ద్వారా అవినీతి అధికారులపై వచ్చిన ఫిర్యాదులతో రెండు రోజులుగా ముమ్మర సోదాలు నిర్వహించారు. ఆదాయనికి మించి ఆస్తులు కూడబెట్టారన్న సమాచారంతో రవాణా శాఖ ఏఓ, ఎంవీఐ, గనుల శాఖలకు చెందిన అసిస్టెంట్ జియాలజిస్ట్, ఇబ్రహీంపట్నం సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలు ఇళ్లపై సోదాలు నిర్వహించారు.
వీరి వద్ద నుంచి పెద్ద ఎత్తున అక్రమ ఆస్తులను స్వాధీనం చేసుకున్నారు. అలాగే జనన ధృవీకరణ పత్రం కోసం కాకినాడ జిల్లా సామర్లకోట రెవన్యూ ఇనస్పెక్టర్ లంచం తీసుకుంటూ దొరికారని ఏసీబీ డీజీ తెలిపారు. కాకినాడ బెండపూడి ఆర్టీఏ చెక్ పోస్టు ఎంవీఐ పి.రమేష్ బాబు కు చెందిన విజయవాడ, మెదక్, హైదరాబాద్, కంచికచర్ల, గుడివాడ, కనుమోలు నివాసాల్లో తనిఖీలు నిర్వహించారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

ACB

సంబంధిత వార్తలు: