జూబ్లీహిల్స్ అభ్యర్థుల అఫిడవిట్లలో అబద్దాలు?

Chakravarthi Kalyan
జూబ్లీహిల్స్ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న ప్రధాన పార్టీ అభ్యర్ధులు తమ అఫిడవిట్లలో వాస్తవాలు దాచిపెట్టి తప్పుడు సమాచారం ఇచ్చారన్న ఆరోపణలు వస్తున్నాయి. స్వతంత్ర అభ్యర్ధి వి.నవీన్‌యాదవ్.. ఈసీ మార్గదర్శకాలకు పూర్తి భిన్నంగా భారాస అభ్యర్ధి, ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్, కాంగ్రెస్ అభ్యర్ధి మహ్మద్ అజహరుద్దీన్ తమ అఫిడివిట్లలో కుటుంబ సభ్యులు, ఆస్తులు, కేసులు, ఇతర వ్యక్తిగత వివరాలు పారదర్శకంగా ఇవ్వలేదని ఆరోపించారు. భారాస అభ్యర్ధి గోపీనాథ్‌కు మొదటి భార్య, కొడుకు విషయం ప్రస్తావించలేదట. విద్యార్హతలు కూడా తప్పుడు తడకలతో కూడినవి పొందుపరిచారట.

అజహరుద్దీన్‌ కూడా తమ భార్య సంగీతా బిజులానీ విడాకులు తీసుకుంది. చెక్ బౌన్స్, ఇతర కేసులు ఉన్నాయని ప్రస్తావించలేదు. ఎలాంటి ఫిర్యాదు లేకపోయినా భాజపా అభ్యర్థి అఫిడవిట్‌లో లోపాలు ఉన్నాయని నోటీసులు ఇస్తే అవి సరిచేసి సమర్పించారన్నారు. కొందరు స్వంత్రులవి కూడా తిరస్కరించారట. ప్రధాన పార్టీల అభ్యర్ధులు వాస్తవాలు దాచిపెట్టిన దృష్ట్యా నామినేషన్లు తిరస్కరించాలని ఎన్నికల రిటర్నింగ్ అధికారికి ఫిర్యాదు చేసినప్పటికీ... తమ అభ్యంతరాలు పరిగణలోకి తీసుకోలేదని ఆయన ఆరోపించారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: