ఎన్నికల సమయంలో పోటీ చేసే అభ్యర్థులు తమ ఆస్తిపాస్తులను తప్పనిసరిగా అఫిడవిట్ రూపంలో చూపించాల్సిందే. అలా తాజాగా కేసీఆర్ చూపించిన ఆస్తులు చర్చనీయాంశంగా మారాయి. బీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ గజ్వేల్, కామారెడ్డిలో నామినేషన్ దాఖలు చేసిన సమయంలో సమర్పించిన అఫిడవిట్‌లో తన పేరిట ఉన్న ఆస్తులు, అప్పులు, కేసులను వివరించారు. కేసీఆర్‌కు స్థిరాస్తుల రూపంలో రూ. 17.83 కోట్ల ఆస్తులు ఉన్నాయట. అలాగే చరాస్తుల రూపంలో రూ. 9.67కోట్లు ఉన్నాయనట. కేసీఆర్ భార్య శోభా పేరుమీద రూ. 7.78 కోట్ల విలువైన చరాస్తులు ఉన్నాయని అఫిడవిట్‌లో తెలిపారు. ఇవి కాకుండా ఉమ్మడి ఆస్తిగా రూ. 9.81 కోట్ల చరాస్తులు ఉన్నాయట. కేసీఆర్ సతీమణి శోభా పేరుపై రూ. 17 కోట్లకు పైగా బ్యాంక్ డిపాజిట్లు కూడా ఉన్నాయి. అలాగే కేసీఆర్ పేరుపై 9 బ్యాంక్ అకౌంట్లు ఉంటే.. ఆయన సతీమణి శోభకు మూడు బ్యాంక్ అకౌంట్స్ ఉన్నాయట. మొత్తం మీద కేసీఆర్ ఆస్తిపాస్తులు 70 కోట్ల లోపే ఉన్నాయట.