రహస్యం: బండి సంజయ్‌ని ఇంటికి పంపింది అందుకే?

Chakravarthi Kalyan
బీజేపీ, బీఆర్‌ఎస్‌, మజ్లీస్‌ మూడు పార్టీలు ఒకటేనని సీపీఐ నేతలు ఆరోపించారు. అందుకే బండి సంజయ్‌కు బండి కట్టి ఇంటికి పంపారని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు విమర్శించారు. కేసీఆర్‌ నియతృత్వ పోకడకి వ్యతిరేఖంగా పోరాడడంతోపాటు ప్రజాస్వామ్యాన్ని కాపాడాల్సిన అవసరం ఎంతైనా ఉందని కూనంనేని సాంబశివరావు అభిప్రాయపడ్డారు. కాంగ్రెస్ పార్టీతో తమకు పొత్తు అనివార్యమైనట్లు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు వెల్లడించారు.

కాంగ్రెస్‌ అధికారంలోకి రావడానికి సానుకూల పవనాలు వీస్తున్నాయని కూనంనేని సాంబశివరావు అన్నారు. కాంగ్రెస్ అనుకూల వాతావరణాన్ని చూసి ఇతర పార్టీలు కృత్రిమంగా నడుచుకుంటున్నాయని కూనంనేని సాంబశివరావు ఆరోపించారు. ప్రశ్నించే గొంతుక అసెంబ్లీలో ఉండాలని, కాని బీఆర్‌ఎస్‌ ప్రశ్నించే గొంతుకలను నొక్కేసిందని కూనంనేని సాంబశివరావు ఆరోపించారు. సీపీఎంతో కూడా ఏదొక విధంగా అవగాహన వస్తుందని ఇప్పటి వరకు తాము భావించామని.. భవిష్యత్తులో కూడా ఈ స్నేహం ఇలానే కొనసాగాలని భావిస్తున్నట్లు కూనంనేని సాంబశివరావు తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వచ్చి తీరుతుందని కూనంనేని సాంబశివరావు జోస్యం చెప్పారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: