కాళేశ్వరం అవినీతి.. దేవుడే బయటపెట్టాడా?
రాష్ట్ర ప్రభుత్వం కాంట్రాక్టర్‌కు ప్రాజెక్టును అమ్ముకుందని బీజేపీ రాష్ట్ర ఎన్నికల ఇంచార్జీ ప్రకాష్ జవదేకర్ ఆరోపించారు. రాష్ట్రంలో ఎన్నో సమస్యలున్నాయని విమర్శించారు. ప్రభుత్వ ఒత్తిడితో పోలీసులు పనిచేస్తున్నారని...గతంలో ఉమ్మడి రాష్ట్రంలో పోలీసుల స్థితి బాగుండేదని కిషన్ రెడ్డి అన్నారు. కానీ ఇప్పుడు పోలీసు వ్యవస్థను రాజకీయం చేశారని మండిపడ్డారు. అవినీతి లేకుండా ప్రభుత్వాన్ని నడపలేని పరిస్థితిలో ఉన్నారని భాజపా చార్జీషీటు కమిటీ ఛైర్మన్ మురళీధర్ రావు అన్నారు.