ఎంఐఎం అసదుద్దీన్‌కు మోదీ డబ్బు పంపుతున్నారా?

Chakravarthi Kalyan
దేశంలోని 28 రాష్ట్రాల్లో పోటీ చేసేందుకు ఎంఐఎంకు డబ్బులు ఎలా వస్తున్నాయని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ప్రశ్నించారు. ఎంఐఎంకు వచ్చే డబ్బులు కేసీఆర్‌, మోదీ నుంచి కాదా అని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ అన్నారు. ప్రధాని మోదీ సీఎం కేసీఆర్ తనను తలచుకుని కలలో కూడా ఉలిక్కిపడుతున్నారని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఆరోపించారు. తెలంగాణ రాష్ట్రంలో రెండు శాతం కూడా ఓట్లు లేని భాజపా ఓబీసీ నేతను ముఖ్యమంత్రిని ఎలా చేస్తుందని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ప్రశ్నించారు.

జడ్చర్ల, షాద్ నగర్‌లలో పర్యటించిన రాహుల్ గాంధీ.. బీజేపీ, బీఆర్ఎస్ ఎంఐఎంలపై తీవ్ర విమర్శలు చేశారు. తెలంగాణ రాష్ట్ర సంపదంతా ఒకే కుటుంబం పాలైందని రాహుల్ గాంధీ ధ్వజమెత్తారు. రాష్ట్రంలో ఆదాయం వచ్చే శాఖలన్నీ ఒకే కుటుంబం చేతిలో ఉన్నాయని రాహుల్ గాంధీ మండిపడ్డారు.  కాళేశ్వరం ప్రాజెక్టు పేరుతో లక్ష కోట్లు దోచుకున్నారని రాహుల్ గాంధీ ఆరోపించారు

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: