దసరాకు ఊరెళ్తున్నారా.. గుడ్‌న్యూస్..?
ఇతర జోన్ లకు చెందిన మరో 133 ప్రత్యేక సర్వీసులు దక్షిణ మధ్య రైల్వే జోన్ మీదుగా వెళతాయి. మొత్తం 621 ప్రత్యేక సర్వీసులను దసరా పండుగ సందర్బంగా ప్రజలకు అందుబాటులో ఉంచుతారు. ప్రయాణికుల సౌకర్యార్థం టికెట్ బుకింగ్ కౌంటర్లను పెంచుతారు. సాధారణ సర్వీసులకు ప్రయాణికుల రద్దీని బట్టి అదనపు కోచ్ లను ఏర్పాటు చేస్తారు. పండుగల వేళ ప్రయాణికుల రద్దీని తగ్గించేందుకు ప్లాట్ ఫారం టికెట్ ధరలను పెంచుతారు.