శ్రీహరికి ఉన్న ఆ ఒక్క చెత్త అలవాటే ఆయన ప్రాణం తీసిందా.?

Pandrala Sravanthi
దివంగత నటుడు శ్రీహరి.. ఈయన పేరు వింటే తెలియని తెలుగు సినీ ప్రేక్షకులు ఉండరు. సౌత్ ఇండస్ట్రీలో తన యాక్టింగ్ తో ఎంతో మంచి గుర్తింపు తెచ్చుకున్న శ్రీహరి హీరోగా.. విలన్ గా..క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా.. ఇండస్ట్రీలో రాణించారు. అలాంటి విభిన్న పాత్రలు పోషించిన శ్రీహరి ప్రస్తుతం మన ముందు లేరు. ఆయన మరణించిన సమయంలో సినీ ఇండస్ట్రీ మొత్తం బాధపడింది. ఒక మంచి నటుడుని కోల్పోయామే అని దిగ్భ్రాంతి చెందారు. అయితే అలాంటి శ్రీహరి మరణానికి ఆ ఒక్క చెత్త అలవాటే కారణం అంటూ సంచలన విషయాన్ని బయట పెట్టారు గేయ రచయిత సుద్దాల అశోక్ తేజ.


ఆయన రీసెంట్గా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. శ్రీహరి లాంటి నటుడిని నేను ఎక్కడా చూడలేదు. ఆయన దయా హృదయంతో ఎంతోమంది కళాకారులకి సహాయం చేశారు.. అవకాశాలు లేని వారికి ఎంతో మందికి అవకాశాలు ఇప్పించి వారి కడుపు నింపారు.ఒకానొక సమయంలో నేను ఇండస్ట్రీ వదిలి వెళ్ళిపోదాం అనుకున్నాను.ఆ సమయంలో నాకు అవకాశాలు రాలేదు. దాంతో ఇండస్ట్రీ వదిలేసి నేను అంతకుముందు చేసిన పాత ఉద్యోగం చేయాలి అనుకున్నాను. కానీ అదే సమయంలో శ్రీహరి నాకు పునర్జన్మని ఇచ్చారు. ఆయన నటించే భద్రాచలం సినిమాలో అవకాశం ఇచ్చారు.


ఆ సినిమాలో 'ఒకటే జననం ఒకటే మరణం' అనే పాట ద్వారా మళ్ళీ నాకు ఇండస్ట్రీలో అవకాశాలు వచ్చాయి. ఆయన చనిపోయే వరకు కూడా తోటి కళాకారుల కోసం పేదల కోసం పరితపించారు. అలాంటి శ్రీహరి మరణానికి కారణం ఎక్కువగా పాన్ తినడమే.ఆయన తరచూ పాన్ తినేవారు. అలా పాన్ తిని తినీ ఆయన కాలేయం పాడైపోయింది. ఆ అలవాటు వల్లే ఆయన మరణించారని ఆ తర్వాత తెలిసింది. ఆ ఒక్క అలవాటు లేకపోతే శ్రీహరి ఇప్పటికీ మన కళ్ళ ముందు ఉండేవారు.భద్రాచలం సినిమా సమయంలో ఎంతో ఆరోగ్యంగా బలంగా కనిపించిన శ్రీహరి ఆ తర్వాత బలహీనంగా కనిపించారు అంటూ శ్రీహరి మరణాన్ని తలుచుకొని ఎమోషనల్ అయ్యారు సినీ గేయ రచయిత సుద్దాల అశోక్ తేజ..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: