
డబ్బులు పంచుతున్న మల్లారెడ్డి?
అయితే మంత్రి ఓ కండీషన్ పెట్టారు. తానిచ్చిన డబ్బులు దేవుడికే వాడాలని, సొంతగా వాడుకోవద్దని మల్లారెడ్డి సూచించారు. సరే సరే అంటూ ఆనందపడిన పిల్లలంతా జై మల్లన్న అంటూ జై జై మల్లన్న అంటూ నినాదాలు చేశారు. మేడ్చల్ జిల్లాలో జరిగిన ఈ సంఘటన సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఏం చేసినా మంత్రి మల్లారెడ్డి తనదైన స్టయిల్ చూపుతారు. మల్లారెడ్డి మాట్లాడే మాట తీరు, ఆయన ప్రవర్తన, నడవడిక డిఫరెంట్‌గా ఉంటూ ఆకట్టుకుంటాయి.