తెలంగాణకు గుడ్‌న్యూస్.. విస్తరించనున్న లులూ గ్రూప్‌?

Chakravarthi Kalyan
తెలంగాణ రాష్ట్రంలో తన కార్యకలాపాలను మరింతగా విస్తరించనున్నట్లు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ కి చెందిన ప్రముఖ వ్యాపార సంస్థ లులూ గ్రూప్ ప్రకటించింది. తెలంగాణ మంత్రి కేటీఆర్‌ తో దుబాయ్‌లో లులూ గ్రూప్ చైర్మన్ యూసుఫ్ అలీ, ప్రతినిధి బృందం సమావేశమై ఈ నిర్ణయం తీసుకున్నారు. తెలంగాణ రాష్ట్రంలో  ఫుడ్ ప్రాసెసింగ్ రంగంతో పాటు షాపింగ్ మాల్స్, రిటైల్ రంగంలో కొనసాగుతున్న కార్యకలాపాలను యూసుఫ్ అలీ మంత్రి కేటీఆర్ కి తెలిపారు.  తెలంగాణ రాష్ట్రంలో తమ కార్యకలాపాల పట్ల అత్యంత సంతృప్తి వ్యక్తం చేసిన లులు గ్రూప్ చైర్మన్ యూసుఫ్ అలీ అందుకు కారణమైన తెలంగాణ ప్రభుత్వానికి, మంత్రి కేటీఆర్ కి ధన్యవాదాలు తెలిపారు.

తెలంగాణ రాష్ట్రంలో తమ సానుకూల అనుభవాలను దృష్టించుకుని దృష్టిలో ఉంచుకొని లులూ గ్రూప్ కార్యకలాపాలను విస్తరించనున్నట్లు లులు గ్రూప్ చైర్మన్ యూసుఫ్ అలీ తెలిపారు. సిరిసిల్ల జిల్లాలో రానున్న ఆక్వా క్లస్టర్ లో పెట్టుబడులు పెట్టేందుకు లులు గ్రూప్ చైర్మన్ యూసుఫ్ అలీ ముందుకువచ్చారు. ఏటా సుమారు 1000 కోట్ల ఆక్వా ఉత్పత్తులను ఈ ప్రాంతం నుంచి సేకరించినందుకు సంసిద్ధత వ్యక్తం చేశారు. దీని ద్వారా ఈ ప్రాంతంలో 500 మందికి నేరుగా ఉపాధి అవకాశాలు కలుగుతాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: