సుప్రీంకోర్టుకే ఝలక్ ఇచ్చిన మోదీ..?

Chakravarthi Kalyan
ప్రధాని మోదీ సుప్రీంకోర్టుకే ఝలక్ ఇచ్చారు. ఎన్నికల కమిషనర్ల నియామకాల్లో సీజేఐ పాత్ర లేకుండా కొత్త బిల్లు రెడీ చేస్తోంది. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం కొత్త బిల్లును నిన్న రాజ్యసభలో ప్రవేశపెట్టింది. ప్రధానమంత్రి, లోక్‌సభలో విపక్ష నేత, సీజేఐతో కూడిన ముగ్గురు సభ్యుల కమిటీ సిఫారసుల మేరకు.. కేంద్ర ఎన్నికల కమిషనర్‌, ఇతర కమిషనర్ల నియామకాన్ని రాష్ట్రపతి చేపట్టాలంటూ గత మార్చిలో సర్వోన్నత న్యాయస్థానం తీర్పు ఇచ్చింది.


దీనికి భిన్నంగా ఈ బిల్లు రూపొందించారు.  నియామకాల కమిటీలో సీజేఐకు పాత్ర లేకుండా చేసేశారు. ఆయన స్థానంలో క్యాబినెట్‌ మంత్రికి ఛాన్స్ ఇచ్చారు. నిన్న ప్రతిపక్ష పార్టీల సభ్యుల ఆందోళన మధ్య రాజ్యసభలో బిల్లు ప్రవేశపెట్టారు. దీని ప్రకారం సీఈసీ, ఈసీల నియామకానికి ప్రధాని సహా ముగ్గురు సభ్యులతో ఎంపిక కమిటీ ఉంటుంది. కమిటీ చైర్మన్‌ ప్రధాని. సభ్యులుగా కేంద్ర క్యాబినెట్‌ మంత్రి, లోక్‌సభలో విపక్ష నేత ఉంటారు.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: