ఎవరి కోసం చిరంజీవి పొలిటికల్ డైలాగులు?
ముఖ్యమంత్రి ఏ విషయంలో అయినా వివిక్ష లేకుండా వెళుతున్నారని... సినిమాల్లో కూడా బడ్జెట్ లింక్‌డ్ టికెటింగ్ పెట్టారని... ఇంత పారదర్శక వ్యవస్థ పెట్టిన ముఖ్యమంత్రి వైయస్ జగన్‌ని ఇదే చిరంజీవి బాగా చేశారన్నట్లు గుర్తు ఉందని వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. చిరంజీవి
ఎవరి తరఫున మాట్లాడాడో కూడా తమకు అర్ధం కావడం లేదన్న వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి .. రాజకీయాల గురించి మాట్లాడాలనుకుంటే క్లియర్‌గా మాట్లాడాల్సిందన్నారు.