కేసీఆర్.. మమ్మల్ని తక్కువ అంచనా వేయొద్దు?
కమ్యూనిస్టులకు కష్టాలు వస్తాయని.. అయినా తాము పేద ప్రజలకు అండగా నిలుస్తామని సాంబశివరావు స్పష్టం చేశారు. పోరాటాలతోనే సమస్యలు సాధ్యమవుతాయన్న సాంబశివరావు.. ప్రభుత్వంపై ప్రజా సమస్యల సాధనకై పోరాటాలే శరణ్యమన్నారు. ఆ పోరాటాలకు నాయకత్వం వహించేది ఎర్రజెండా మాత్రమేనని సాంబశివరావు అన్నారు. పేదల కోసం పోరాడడమే కాకుండా ప్రభుత్వం మెడలు వంచి వారికి అండగా నిలుస్తామని సాంబశివరావు అన్నారు. గత ఎన్నికల్లో పేదలకు రెండు పడకల గదులు ఇల్లు ఇస్తామని చెప్పిన ముఖ్యమంత్రి ఆ మాటలను దాటవేయడమేంటని సాంబశివరావు మండిపడ్డారు.