ఈ కోర్సు చేస్తే వెంటనే ఉద్యోగాలు?

Chakravarthi Kalyan
ఇప్పుడు యువతకు ఉద్యోగాలు ఇచ్చే చదువులు కావాలి. తెలంగాణ మొబిలిటీ వ్యాలీ టిఎమ్‌వి ఆటోమోటివ్ రంగంలో అధునాతన వృత్తిని అభ్యసిస్తున్న విద్యార్థులకు ఉత్తేజకరమైన అవకాశాలను సృష్టిస్తోందని మంత్రి కేటిఆర్‌ అంటున్నారు. టిఎమ్‌వి హ్యుండై మెుబిస్‌, బిట్స్‌ పిలాని హైదరాబాద్‌ క్యాంపస్‌ కలిసి సరికొత్త 11 నెలల పోస్ట్‌ గ్రాడ్యుయేట్‌ డిప్లొమా కోర్సును ప్రవేశ పెట్టినట్లు మంత్రి కేటిఆర్‌ సోషల్ మీడియా ద్వారా తెలిపారు.


ఎలక్ట్రిఫికేషన్‌, అటానమస్‌ డ్రైవింగ్‌, కనెక్టెడ్‌ వెహికల్‌, కృత్రిమ మేధా, మెషీన్‌ లర్నింగ్‌, సైబర్‌ సెక్యూరిటీ వంటి రంగాల్లో ఈ పోస్ట్‌ గ్రాడ్యుయేట్‌ డిప్లొమా కోర్సును ప్రవేశ పెట్టినట్లు మంత్రి కేటిఆర్‌ తన సోషల్ మీడియా పోస్టులో వివరించారు.  హైదరాబాద్‌ బిట్స్‌ పిలానీలో ఈ కోర్సు పూర్తి చేసిన వారికి హ్యీండై మెుబీస్‌లో లైవ్‌ ప్రాజెక్టులపై పని చేసే అవకాశం దొరుకుతుందని మంత్రి కేటీఆర్‌ తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

JOB

సంబంధిత వార్తలు: