
వర్షాకాలం అరాచకాలకు.. హైదరాబాద్ సిద్ధమేనా?
అసలే ఈ వారాంతం నుంచి భారీ వర్ష సూచన ఉన్న నేపథ్యంలో అంతర్గత విభాగాలతో పాటు ఇతర శాఖలతో కలిసి వర్షాల వల్ల ఎదురయ్యే పరిస్థితులను ఎదుర్కొనేందుకు సమన్వయంతో పని చేయాల్సి ఉంటుంది. పారిశుధ్య నిర్వహణకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలి. అత్యంత కీలకమైన పారిశుధ్య కార్మికులతో సమావేశం ఏర్పాటు చేసుకోవాలి. ఎక్కడికక్కడ అధికారులు పారిశుధ్య కార్మికులతో భోజన సమావేశాలు ఏర్పాటు చేసుకోవాలి. నగర పారిశుద్ధ్యన్ని మరింతగా మెరుగుపరిచేందుకు తీసుకోవాల్సిన చర్యలపైన దిశానిర్ధేశం చేయాలి.