రూ. 1000కోట్లు దాటిన విరాట్‌ కోహ్లీ ఆస్తులు..?

Chakravarthi Kalyan
క్రికెటర్‌ విరాట్‌ కోహ్లీ నికర ఆస్తుల విలువ వెయ్యి కోట్లు దాటి పోయింది. విరాట్‌ కోహ్లీ ఆస్తుల విలువ వెయ్యి 50కోట్లుగా తేలింది. స్టాక్‌గ్రో అనే కంపెనీ కోహ్లీ ఆస్తులపై తాజాగా ఈ ఆసక్తికర విషయాలు వెల్లడించింది. విరాట్ ఆదాయం విషయానికి వస్తే.. ఆయనకు టీమిండియా కాంట్రాక్ట్‌ ద్వారా బీసీసీఐ నుంచి 7 కోట్ల రూపాయలు లభిస్తుంది. అలాగే ప్రతి టెస్టుకు 15 లక్షలు, వన్డేకు 6 లక్షలు, టీ-20 మ్యాచ్‌కు 3 లక్షల రూపాయలు ఫీజుగా విరాట్‌ కోహ్లీ సంపాదిస్తున్నాడు.


ఇక ఐపీఎల్‌ ఆర్సీబీ జట్టు ద్వారా ఏడాదికి 15 కోట్ల రూపాయలు విరాట్‌ కోహ్లీ పొందుతున్నాడు. అలాగే విరాట్‌ కోహ్లీకి సొంతంగా కూడా బ్లూట్రైబ్‌, యూనివర్సల్‌ స్పోర్ట్స్‌బిజ్‌, ఎంపీఎల్‌, స్పోర్ట్స్‌ కాన్వో లాంటి సొంత బ్రాండ్లు ఉన్నాయి. అనేక స్టార్టప్స్‌లో విరాట్‌ కోహ్లీ పెట్టుబడులు ఉన్నాయి. అంతేకాదు విరాట్‌ కోహ్లీ దాదాపు 18బ్రాండ్లకు అంబాసిడర్‌గా ఉన్నాడు. ఒక్కో యాడ్ కు విరాట్‌ కోహ్లీ 10 కోట్ల వరకు వసూలు చేస్తాడు. ప్రకటనలకు ప్రచారకర్తగా ఉండటం ద్వారా విరాట్‌ కోహ్లీ ఏటా దాదాపు 175 కోట్ల రూపాయలు సంపాదిస్తున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: