మోడీ సర్కారు.. 2 లక్షల ఉద్యోగాలు మాయం చేసిందా?

Chakravarthi Kalyan
ప్రభుత్వరంగ సంస్థలైన పీఎస్‌యూలలో దాదాపు 2లక్షల ఉద్యోగాలను కేంద్రం తొలగించిందా.. అంటే అవునంటున్నారు కాంగ్రెస్‌ మాజీ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ. మోడీ సర్కారు చర్యలతో లక్షలాది మంది యువతకు ఉద్యోగాలు కరవయ్యాయన్నారు రాహుల్‌ గాంధీ. యువత ఆశలపై ప్రభుత్వం నీళ్లు చల్లిందని రాహుల్‌ గాంధీ మండిపడ్డారు. కొంతమంది ఆశ్రిత పెట్టుబడిదారుల కోసమే భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఇలా చేస్తోందని రాహుల్‌ గాంధీ విమర్శించారు.
ప్రభుత్వ రంగ సంస్థలు ఒకప్పుడు దేశానికి గర్వకారణంగా ఉండేవన్న రాహుల్‌ గాంధీ.. యువత ఉద్యోగాల కలకు నెలవుగా ఉండేవని గుర్తు చేశారు. కానీ నేడు అవి ప్రభుత్వ ప్రాధాన్యాల్లో లేనేలేవని రాహుల్‌ గాంధీ దుయ్యబట్టారు. ఏటా 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామని హామీ ఇచ్చిన మోదీ సర్కార్.. ఇప్పుడు 2 లక్షల ఉద్యోగాలు తొలగించిందని రాహుల్‌ గాంధీ ధ్వజమెత్తారు. 2014లో పీఎస్‌యూలలో 16.9 లక్షల ఉద్యోగాలు ఉండేవన్న రాహుల్‌ గాంధీ.. అవి 2022 నాటికి 14.6 లక్షలకు తగ్గాయని రాహుల్‌ గాంధీ అన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: