శభాష్.. చైనా, బ్రెజిల్ తర్వాత తెలంగాణే!?
ప్రతి గ్రామంలో చెట్ల పెంపకాన్ని తప్పనిసరి చేస్తూ తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే చట్టం చేసింది. ప్రతి గ్రామంలో నర్సరీ ఏర్పాటు చేసి, మొక్కలను నాటి వాటిని రక్షించి, గ్రామంలో పచ్చదనాన్ని పెంచి, పరిశుభ్రతను కాపాడాలని ఆ చట్టం చెబుతోంది. గ్రామ స్థాయిలో గ్రామ సర్పంచ్ అధ్యక్షతన కార్యక్రమాన్ని పర్యవేక్షిస్తున్నారు. హరిత రక్షణ కమిటీలను కూడా ఏర్పాటు చేసి జియో ట్యాగింగ్ ద్వారా మొక్కలను పర్యవేక్షిస్తున్నారు. పచ్చదనం పెంపొందించేందుకు అవెన్యూ ప్లాంటేషన్, బ్లాక్ ప్లాంటేషన్, సంస్థగత ప్లాంటేషన్, హోమ్ స్టెడ్ ప్లాంటేషన్, ఆగ్రో ఫారెస్ట్రి ప్లాంటేషన్ పేరిట మొక్కలను పెద్ద సంఖ్యలో నాటున్నారు.