అప్పుడు ఆంధ్రావాళ్లు దొంగలన్నారు.. ఇప్పుడు?

Chakravarthi Kalyan
హైదరాబాద్‌లోని శేరిలింగంపల్లి నియోజకవర్గంలో ఉన్న చెరువులన్నీ కబ్జాకు గురవుతున్నాయని మాజీ ఎంపీ, బీజేపీ నేత కొండా విశ్వేశ్వర్ రెడ్డి ఆరోపిస్తున్నారు. ఈ నియోజకవర్గంలో అభివృద్ది జరుగలేదని.. చివరకు కేటీఆర్ దత్తత తీసుకున్న హైదర్‌నగర్‌ డివిజన్‌లో ఎక్కడికి వెళ్లి చూసినా ఏమిలేదని బీజేపీ నేత కొండా విశ్వేశ్వర్ రెడ్డి ధ్వజమెత్తారు. మియాపూర్ అల్విన్ కాలనీలో కొత్తగా ఏర్పాటు చేసిన పార్టీ కార్యాలయాన్ని బీజేపీ నేత కొండా విశ్వేశ్వర్ రెడ్డి ప్రారంభించారు.


గతంలో ఆంధ్ర నాయకులు దొంగలన్న కేసీఆర్.. ఇప్పుడు అన్ని వారికే కట్టబెడుతున్నారని బీజేపీ నేత కొండా విశ్వేశ్వర్ రెడ్డి విమర్శించారు. కనీస మౌలిక వసతులు కల్పించడంలో తెలంగాణ ప్రభుత్వం విఫలమైందని బీజేపీ నేత కొండా విశ్వేశ్వర్ రెడ్డి ఆరోపించారు. హైటెక్‌ సిటీ ఏరియాను చూస్తే అమెరికా చూసినట్లు ఉంటుందని కేటీఆర్ అంటున్నారని.. అదే కేటీఆర్‌ హఫీజ్‌పేట్‌ తోపాటు ఇతర ఏరియాలను చూడాలని కొండా విశ్వేశ్వర్ రెడ్డి హితవు పలికారు. కేసీఆర్, కేటీఆర్ ఫ్యామిలీపై పోరాటం బీజేపీకే సాధ్యమన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

kcr

సంబంధిత వార్తలు: