కేసీఆర్.. మాట తప్పొద్దంటున్న బండి సంజయ్‌?

Chakravarthi Kalyan
సీఎం అయ్యాక ఓట్ సోర్సింగ్, కాంట్రాక్ట్ ఉద్యోగులే ఉండరని, అందరినీ పర్మినెంట్ చేస్తామని నిండు అసెంబ్లీలో చెప్పి కేసీఆర్  మాట తప్పారని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ అంటున్నారు. ఉద్యోగులారా... భయపడి ఇంట్లో కూర్చుంటే మీ సమస్యలు పరిష్కారం కావు.. రోడ్లపైకి వచ్చి ఆందోళన చేస్తేనే మీ సమస్యలు పరిష్కారమవుతాయని బండి సంజయ్‌ ఉద్యోగులనుద్దేశించి అన్నారు. ఏ లక్ష్యంతో తెలంగాణ తెచ్చుకున్నారో అది నెరవేరాలంటే రోడ్లెక్కాల్సిందేనని బండి సంజయ్‌ స్పష్టం చేశారు.

జూనియర్ పంచాయితీ కార్యదర్శులను సస్పెండ్ చేస్తే భయపడవద్దని మీ తరపున ఉద్యమిస్తామని.. ఉద్యోగుల కోసం జైలుకు వెళ్లేందుకు సిద్దమని...మిమ్ముల్ని బెదిరిస్తే ప్రగతిభవన్‌ను ముట్టడిస్తామని బండి సంజయ్‌ తెలిపారు. జూనియర్ పంచాయితీ కార్యదర్శులు చేస్తున్న సమ్మె న్యాయబద్దమైనదేనని వారికి పూర్తి సంఘీభావం ప్రకటిస్తున్నామని  బండి సంజయ్‌ వెల్లడించారు. తక్షణమే జూనియర్ పంచాయితీ కార్యదర్శులను రెగ్యులరైజ్ చేయాలని బండి సంజయ్‌ డిమాండ్ చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: