ఏంటి? జగన్‌ జడ్జిలను కూడా బదిలీ చేయిస్తారా?

Chakravarthi Kalyan
ప్రస్తుతం జగన్ పై హత్యాయత్నం కేసును విచారిస్తున్న జడ్జి ప్రమోషన్ మీద బదిలీపై వెళ్తున్నారు. కానీ ఆ రెండు పత్రికలు మాత్రం భిన్నమైన కథనాలు ప్రచురితం చేస్తున్నాయి. అసలు జడ్జిలను ఎవరు బదిలీ చేస్తారు. హైకోర్టు న్యాయమూర్తి బదిలీ చేస్తారు. లేదా కొలిజీయం అనే ఒక వ్యవస్థ ఉంటుంది. ఇది తెలిసి ప్రజలను తప్పుదోవ పట్టించేందుకు ప్రయత్నాలు చేస్తుంది.

అహంకారం, అహంభావంతో చెప్పు చేతల్లో ఉండాలనే నిరంకుశత్వంతో ఈ రెండు పత్రికలు వార్తలు రాస్తున్నాయి. కోడి కత్తి జడ్జి అని రాయడం వీరికే చెల్లింది. ఒక న్యాయమూర్తి గురించి రాసే సమయంలో అలాంటి పదాలు రాయొచ్చో లేదో వారికే తెలియాలి. తమకు వ్యతిరేకంగా ఉన్న జగన్ ను ఎలాగైనా గద్దె దించేందుకు ఎలాంటి వార్తలనైనా రాస్తారానే దానికి ఇదే ఒక మంచి ఉదాహరణగా చెప్పుకోవచ్చు. మరి అంతే కదా?

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: