అకాల పంట నష్టం.. లెక్కలు తేల్చండి?

Chakravarthi Kalyan
తెలంగాణలో అకాల వర్షాలతో వివిధ జిల్లాల్లో జరిగిన పంటనష్టం వివరాలను వచ్చే నెల ఒకటో తేదీ లోగా సమర్పించాలని జిల్లా కలెక్టర్లను సీఎస్‌ శాంతి కుమారి ఆదేశించారు. పంటనష్టంపై కలెక్టర్లతో సీఎస్ టెలికాన్ఫరెన్స్ సమీక్ష నిర్వహించారు. వ్యవసాయ శాఖ కార్యదర్శి రఘునందన్ రావు, విపత్తు నిర్వహణా శాఖ కార్యదర్శి రాహుల్ బొజ్జా, పంచాయతీరాజ్ శాఖ కమిషనర్ హనుమంతరావు ఈ సమీక్షలో పాల్గొన్నారు. ప్రతి మండలానికి ప్రత్యేక అధికారులను నియమించి జరిగిన పంట నష్టం వివరాలను సమర్పించాలని కలెక్టర్లకు సీఎస్‌ శాంతి కుమారి స్పష్టం చేశారు.

గతంలో జరిగిన పంట నష్టానికి సంబంధించిన పరిహారాన్ని ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు  పంపిణీ చేస్తున్నట్లు సీఎస్‌ శాంతి కుమారి చెప్పారు. రాష్ట్రంలో మరికొన్ని రోజుల పాటు ఉరుములతో కూడిన వర్షాలు సంభవించే అవకాశం ఉన్నందున ధాన్యం సేకరణ కేంద్రాల్లో ఉన్న వరి ధాన్యం తడవకుండా తగు చర్యలు తీసుకోవాలని సీఎస్‌ శాంతి కుమారి ఆదేశించారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: