కిరణ్‌ కుమార్‌ రెడ్డీ.. ఇదేం బాలేదుగా?

Chakravarthi Kalyan
భారతీయ జనతా పార్టీలో చేరిన మాజీ ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌ రెడ్డి కాంగ్రెస్‌ పార్టీపై చేసిన వ్యాఖ్యలను ఏపీ పీసీసీ అధ్యక్షుడు గిడుగు రుద్రరాజు తప్పుబట్టారు. కాంగ్రెస్ లో అత్యున్నత పదవులు అనుభవించి పార్టీని వీడుతూ బురద జల్లడం సరికాదని పీసీసీ అధ్యక్షుడు గిడుగు రుద్రరాజు హితవు పలికారు. ఏ నాయకుడైనా తమకు నచ్చిన పార్టీలోకి వెళ్లవచ్చని.. వెళ్లిన తరువాత ముందున్న పార్టీపై బురద జల్లడం ఏమిటని పీసీసీ అధ్యక్షుడు గిడుగు రుద్రరాజు ప్రశ్నించారు.

కాంగ్రెస్‌ పార్టీని తక్కువ చేసి మాట్లాడడంకాని, విమర్శలు చేయడంకాని చేస్తే చూస్తూ ఊరుకునేది లేదని పీసీసీ అధ్యక్షుడు గిడుగు రుద్రరాజు హెచ్చరించారు. మూడున్నర సంవత్సరాలపాటు కాంగ్రెస్‌ ముఖ్యమంత్రిగా పని చేసిన కిరణ్‌కుమార్‌ రెడ్డి రాహుల్ గాంధీ , సోనియాగాంధీలపై విమర్శలు చేయడం సరికాదని పీసీసీ అధ్యక్షుడు గిడుగు రుద్రరాజు అన్నారు. బీజేపీ, ఈడీల దాడులకు భయపడి వెళ్లారా.. పదవుల కోసం వెళ్లారా.. చెప్పాలని పీసీసీ అధ్యక్షుడు గిడుగు రుద్రరాజు డిమాండ్‌ చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: