పాక్‌ అండతో రెచ్చిపోతున్న సిక్కు తీవ్రవాది అమృత్‌పాల్‌?

Chakravarthi Kalyan
సిక్కు దేశాన్ని స్థాపించాలనుకుంటున్న తీవ్రవాదికి సపోర్ట్ చేస్తున్న వాళ్ళు వేరే దేశాల్లో ఉన్న పాకిస్తాన్ అభిమానులు, లేదంటే భారతదేశం ద్వేషులు , ఏదైతే గతంలో ఇందిరా గాంధీ ఆపరేషన్ బ్లూ స్టార్ పేరు తో చేసినప్పుడు పారిపోయినటువంటి సిక్కులు, ఇందిరా గాంధీని చనిపోయిన తర్వాత సిక్కులపై పెద్ద ఎత్తున దాడి జరిగిన సందర్భంలో పారిపోయిన సిక్కులు  వాళ్లందరూ కూడా ఇప్పుడు వేరే వేరే చోట్ల ఉన్నవాళ్లు భారతదేశంలో సిక్కులకు రక్షణ లేదని అంటున్నారు. కానీ ఇక్కడ పంజాబ్ లోనూ, భారతదేశంలోని మిగిలిన రాష్ట్రాల్లోనూ ఉన్న  సిక్కులు కూడా దర్జాగా ఉన్నారు.

ఆరోజు ఇక్కడి నుండి పారిపోయిన వాళ్లే, ఈరోజు అక్కడ నుండి గొడవ చేస్తున్నది.  ఈ అమృత్ పాల్ అనే వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఈ పరిస్థితిని అడ్డం పెట్టుకొని డివిజన్ చేస్తున్నటువంటి వాడి వ్యవహారాలు, కొన్ని కొత్త విషయాలు బయటకు వచ్చాయి.  కలిస్తానీ సానుభూతిపరుడు అమృత్ పాల్ కు సంబంధించిన  సంచలన విషయాలు బయటపడుతున్నాయి. అతనీ పాకిస్తాన్ నుండి ఆయుధాలు సేకరించే పనులో ఉన్నాడని ఇంటిలిజెన్స్ వర్గాలు బయటపెట్టాయి.

దీంతోపాటు పంజాబ్ లో కల్లోలం సృష్టించడానికి ప్రయత్నిస్తున్నాడని ఇంటెలిజెన్స్ వర్గాలు చెప్తున్నాయి. పాకిస్తాన్ నుండి ఇప్పటికే సేకరించిన ఆయుధాలను డి అడిక్షన్ కేంద్రాలు, జల్పూర్ కేళ వద్ద ప్రార్థనా మందిరాల్లో దాచినట్లు సమాచారం. దీంతోపాటు అక్రమాయుధాలు బహిరంగంగా ప్రదర్శించడం లాంటి నేరాలు చేశాడు. అంతేకాకుండా కలిస్తానీ గురించి మాట్లాడే చాలామంది మహిళలతో వివాహేతర సంబంధాలు ఉన్నాయని గుర్తించారు. వీటికి సంబంధించి మహిళలతో చాట్లు, వాయిస్ నోట్లు చేతికొస్తున్నాయి. ఇప్పటికే 12వాయిస్ నోట్లు మీడియా సంస్థల చేతికి వచ్చాయి.

వాటిలో టైంపాస్ కోసం ఈ సంబంధాలు పెట్టుకుంటున్నట్లుగా చెప్తున్న మాటలు కూడా ఉన్నాయి. ఈ మహిళల్లో కొందరు వివాహితులు కూడా ఉన్నట్లు గుర్తించారు. అతడి ఇంస్టాగ్రామ్ చాటింగ్ లో ఒక మహిళను వివాహేతర సంబంధం గురించి అడుగుతున్నట్లుగా కూడా ఉంది. పోలీసులు అతని కోసం వెతుకుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: